భారతదేశం, సెప్టెంబర్ 13 -- Vinayaka Chavithi Tv Shows: పండగ వచ్చిందంటే టీవీ ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ కిక్కే కిక్కు. ఇక వినాయక చవితి పండగ అంటే ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టీవీ ఆడియన్స్ ను అలరించేందుకు ఛానెల్స్ రెడీ అయ్యాయి.

టీవీ ఈవెంట్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఛానెల్ ఈటీవీ. ఈ వినాయక చవితికి కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ షోను ప్లాన్ చేసింది. 'గల్లీ క గణేష్' పేరుతో స్పెషల్ ఈవెంట్ ను టెలికాస్ట్ చేయనుంది. ఉదయం 9 గంటలకే ఈ షో స్టార్ట్ కానుంది. మార్నింగ్ టైమ్ లోనే ఎంటర్ టైన్మెంట్ పండగను షురూ చేయనుంది.

నందు హోస్ట్ గా ఈ గల్లీ క గణేష్ షో సాగనుంది. హైపర్ ఆది, రోహిత్ సహా జబర్దస్త్ బ్యాచ్ పంచ్ లతో ఈ షో సందడిగా సాగనుంది. ఎపిక్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి...