Vikarabad : అనంతగిరి ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం - ప్రైవేట్ బస్సు బోల్తా, నలుగురు దుర్మరణం!
భారతదేశం, అక్టోబర్ 3 -- వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రహదారి ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నియంత్రణ తప్పి తీవ్ర ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడటంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన బాధితులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న బంధువుల అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ క్రమంలో అనంతగిరి కొండ పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో.. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయ వైపు బోల్తా పడింది.
బస్సు బోల్తా పడటం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.