భారతదేశం, జూన్ 18 -- Vijayawada Gade Sai Krishna Missing Case : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సాయికృష్ణ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనానికి దారితీసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విచారణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలోని నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ.. 9వ తరగతితోనే చదువు మానేశాడు. స్థానిక కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని పలు స్టేషన్లలో గంజాయి, పోక్సో సహా వివిధ అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.కొన్ని కేసులు కొట్టేయగ...