భారతదేశం, నవంబర్ 21 -- విజయవాడలోని పాముల కాలువ జంక్షన్ వద్ద వెస్ట్ బైపాస్ నిర్మాణ పనుల్లో భాగంగా, విద్యుత్ తీగలను తొలగించేందుకు వీలుగా శనివారం, ఆదివారం నాడు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని అంబాపురం వద్ద హైటెన్షన్ విద్యుత్ టవర్ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. పనుల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విజయవాడ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, డీసీపీ (ట్రాఫిక్) షిరీన్ బేగం పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

ఏలూరు నుండి వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. గుంటూరు వైపు వెళ్లే వాహనాలు చిన్న అవుటపల్లి, ర...