భారతదేశం, జూలై 25 -- Vijayawada Night Boating : పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని కృష్ణా నదిలో రాత్రివేళ బోటు షికారు (నైట్ క్రూజింగ్) చేసేందుకు పర్యాటక శాఖకు జలవనరుల శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ అయ్యాయి.

ఈ కొత్త నిర్ణయంతో పర్యాటకులు అమరావతి రాజధాని ప్రాంతం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ పరిసరాల్లో రాత్రి 10 గంటల వరకు కృష్ణా నదిలో హాయిగా విహరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ఆధ్వర్యంలో ఈ బోటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పర్యాటకుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అనుమతులతో పాటు అనేక కఠిన నిబంధనలను విధించింది. నది పరివాహక ప్రాంతం, నీటి విడుదల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ విహారాన...