Vijaya Dairy Milk Price : విజయ డెయిరీ పాల ధరలు పెంపు - లీటరుపై ఎంతంటే..?
భారతదేశం, అక్టోబర్ 17 -- సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరమైన విజయ పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (TGDDCF) కీలక నిర్ణయం తీసుకుంది. విజయ తెలంగాణ బ్రాండ్ కింద విక్రయించే స్టాండర్డైజ్డ్ మిల్క్ మరియు హోల్ మిల్క్ రకాలపై 500 మి.లీ (అర లీటరు) ప్యాకెట్కు రూ. 1 చొప్పున ధరను సవరించింది. ఈ పెంచిన సవరించిన ధరలు అక్టోబర్ 17 నుంచే (అక్టోబర్ 16 రాత్రి సప్లైల నుంచి) అమల్లోకి వస్తున్నాయని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
అర లీటరుపై రూపాయి పెరగా. లీటర్ పై రూ. 2 పెంపు ఉంటుంది. ఇక ఈ కొత్త ధరల మార్పును సాధారణ వినియోగదారులు, పాల వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, విద్యా సంస్థలు/రైస్ మిల్లులు వంటి అనుబంధ సంస్థలు, మోడరన్ రిటైల్ మాల్స్, క్విక్ కామర్స్ ఆన్లైన్ యాప్ల యాజమాన్యాలు గమనించాలని జనరల్ మేనేజర్ సూచించారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.