భారతదేశం, అక్టోబర్ 17 -- సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరమైన విజయ పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (TGDDCF) కీలక నిర్ణయం తీసుకుంది. విజయ తెలంగాణ బ్రాండ్ కింద విక్రయించే స్టాండర్డైజ్డ్ మిల్క్ మరియు హోల్ మిల్క్ రకాలపై 500 మి.లీ (అర లీటరు) ప్యాకెట్‌కు రూ. 1 చొప్పున ధరను సవరించింది. ఈ పెంచిన సవరించిన ధరలు అక్టోబర్ 17 నుంచే (అక్టోబర్ 16 రాత్రి సప్లైల నుంచి) అమల్లోకి వస్తున్నాయని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

అర లీటరుపై రూపాయి పెరగా. లీటర్ పై రూ. 2 పెంపు ఉంటుంది. ఇక ఈ కొత్త ధరల మార్పును సాధారణ వినియోగదారులు, పాల వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, విద్యా సంస్థలు/రైస్ మిల్లులు వంటి అనుబంధ సంస్థలు, మోడరన్ రిటైల్ మాల్స్, క్విక్ కామర్స్ ఆన్‌లైన్ యాప్‌ల యాజమాన్యాలు గమనించాలని జనరల్ మేనేజర్ సూచించారు...