భారతదేశం, మే 9 -- Thalapathy Vijay Bodyguard Aroon Suresh Post: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని అధికార పీఠం దిశగా నడిపించిన దళపతి విజయ్‌కు అడుగుడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పెట్టిన నిబంధనలు 'దళపతి'ని టెన్షన్‌లో పెట్టాయి.

అయితే, శుక్రవారం (మే 8) నాటి తాజా పరిణామాల ప్రకారం వీసీకే (VCK), సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల మద్దతుతో దళపతి విజయ్ మెజారిటీని సాధించి, ముఖ్యమంత్రి పీఠం కోసం తన బలాన్ని నిరూపించుకున్నారు.

ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, మ్యాజిక్ ఫిగర్ కోసం దళపతి విజయ్ కొట్టుమిట్టాడుతున్న వేళ హీరో విజయ్ బాడీగార్డ్ అరూన్ సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ...