భారతదేశం, మే 4 -- Thalapathy Vijay TVK In Tamil Nadu Elections: సినిమా తెరపై తన డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనూహ్య ఫలితాలతో దూసుకుపోతోంది.

"ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను" - ఇది తెలుగు రీమేక్ అయిన 'పోకిరి' సినిమాలో విజయ్ చెప్పిన ఫేమస్ డైలాగ్. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించినప్పుడు, ఆయన ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో నేటి ఫలితాలు నిరూపిస్తున్నాయి.

సోమవారం (మే 4) ఉదయం 11 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తన సినిమాలకు వచ్చే భారీ వసూళ్లను, అభిమానగణాన్ని విజయ్ వ...