భారతదేశం, నవంబర్ 27 -- Ranabaali Actor Compares Rashmika Mandanna With Prabhas: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట, గత నెలలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోలో కలిసి సందడి చేశారు.

అప్పటి నుంచి వీరి బంధం, వ్యక్తిత్వాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరితో కలిసి 'రణబాలి' సినిమాలో నటించిన కిషోర్ కుమార్ పొలిమేర తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ విజయ్, రష్మికలకు గట్టి మద్దతుగా నిలిచారు.

'రాజా టాక్స్ ఐడీ' (Raja Talks ID) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కిషోర్ కుమార్ పొలిమేరను, బయట సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలపై యాంకర్ ప్రశ్నించార...