భారతదేశం, మే 10 -- Vijay Deverakonda Birthday Rashmika Mandanna Wishes: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల సందడి సోషల్ మీడియాలో మరోసారి పీక్స్‌కు చేరింది. మే 9న విజయ్ దేవరకొండ తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, ఈసారి సెలబ్రేషన్స్ చాలా ప్రత్యేకంగా మారాయి.

ఎందుకంటే, రష్మిక మందన్నాతో వివాహం తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన తొలి బర్త్‌డే ఇది. ఈ సందర్భంగా రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్త విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

పుట్టినరోజు నాడు విజయ్‌తో గడిపిన క్షణాలను రష్మిక 'రివర్స్ ఆర్డర్'లో వివరించింది. జిమ్ సెల్ఫీలు, కారులో ఏకాంతంగా గడిపిన సమయం, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ఇలా ప్రతిదీ అభిమానులతో పంచుకుంది.

"ఈ...