భారతదేశం, మే 4 -- Vijay Cinema Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకె దుమ్ము రేపుతోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను దాటుకొని.. మెజార్టీ సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విజయ్..తిరుగులేని నాయకుడిగా తమిళనాడు ప్రజల మనసులను గెలుచుకున్నట్లు అయింది.

తన రెండేళ్ల నాటి పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) కోసం ప్రచారం చేస్తూ.. హీరో విజయ్ ఒక భావోద్వేగపూరితమైన పిలుపునిచ్చారు. "మీరు మీ విజయ్‌ను 100 శాతం నమ్మవచ్చు," అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రచార సమయంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 68 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి.. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లను అందుకన్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, ఇప్పుడ...