భారతదేశం, మే 19 -- Venkat Prabhu Gifts TN O7 CM 2026 Number Plate To Thalapathy Vijay: సినిమా స్క్రిప్ట్‌ను మించిపోయేలా తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు దళపతి విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయన ప్రస్థానం వెనుక ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద కృషి ఉంది. సినిమాల్లో సామాజిక అన్యాయాలపై పోరాడే మాస్ హీరోగా కనిపించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ ప్రజా నాయకుడిగా మారారు.

2024లో వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The GOAT) చిత్రంలో దళపతి విజయ్ సీఎం అవుతారనే విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు అప్పుడే ఊహించారు. తాజాగా ఈ దర్శకుడు సీఎం విజయ్‌ను కలిసి ఒక అద్భుతమైన గిఫ్ట్ అందించారు.

'గోట్' సినిమాలో విజయ్ క్యారెక్టర్ వాడిన ఒక వాహనానికి 'TN 07 CM 2026' అనే నంబర్ ప్లేట్ ఉంటుంది. సినిమా తీసేటప్పటికి ఇది కేవ...