భారతదేశం, సెప్టెంబర్ 13 -- CM Vijay Ajith Re Unite In London Silverstone Racing: బ్రిటన్ వేదికగా జరిగిన 'మిచెలిన్ లీ మాన్స్ కప్' రేసింగ్ ఈవెంట్ ఒక అరుదైన, మరచిపోలేని దృశ్యానికి వేదికైంది. వెండితెరపై ప్రత్యర్థులుగా, బయట ప్రాణస్నేహితులుగా ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, కోలీవుడ్ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ ఒకరినొకరు ఆప్యాయంగా కలుసుకున్నారు.

సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో విజయ్ పరుగెత్తుకుంటూ వచ్చి అజిత్‌ను గట్టిగా కౌగిలించుకున్న దృశ్యం సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా, ఈ రేసింగ్ టోర్నీ సందర్భంగా అజిత్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.

బిజీ షెడ్యూల్‌లోనూ తన రేసింగ్ ఈవెంట్‌కు విచ్చేసిన దళపతి విజయ్‌కి అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. "గత 34 ఏళ్లుగా మేము తమిళ సి...