భారతదేశం, జూలై 12 -- వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 15 నుంచి 16 మంది భారతీయులు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయుల బృందం ఈ ప్రమాదానికి గురైంది. ఒక మొబైల్ ట్రేడింగ్ కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ విహారయాత్రలో భాగంగా పర్యాటకులు ఒక దీవిని సందర్శించేందుకు వెళ్లారు. అయితే.. వాతావరణం అనుకూలించకపోవడం, అదే సమయంలో బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.

"ఒక బాధాకరమైన ఘటన వియత్నాంలో జరిగింది. ఒక మొబైల్ ట్రేడింగ్ సంస్థ పంపిన పర్యటనలో భాగంగా భారత దేశం నుంచి చాలా మంది ప...