భారతదేశం, నవంబర్ 24 -- Vetrimaaran About Dhanush Polladhavan: భారతీయ సినీ పరిశ్రమలో వాస్తవికతకు అద్దం పట్టే దర్శకుడిగా వెట్రిమారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంటుంది.

2007లో అప్పటికి 24 ఏళ్ల కుర్రాడైన ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన తొలి చిత్రం 'పొల్లాధవన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా 'కుర్రాడు' పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి ఒక చర్చ నడుస్తూనే ఉంది.

1948 నాటి ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ క్లాసిక్ సినిమా 'బైసికిల్ థీవ్స్' ఆధారంగానే వెట్రిమారన్ ఈ కథ రాసుకున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ విమర్శలపై వెట్రిమారన్ కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.

ఇటీవల జరిగిన '#IFP16' వేడుకలో రౌనక్ మంగోట్టిల్‌తో...