భారతదేశం, ఆగస్టు 10 -- వేళాంకాన్ని పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-వేళంకాన్ని మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగుతాయి. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

ట్రైన్ నెంబర్ 07125 చర్లపల్లి - వేళాంకాన్ని మధ్య 28.08.2026 నుంచి 04.09.2026 వరకు నడుస్తాయి. 07.40 చర్లపల్లిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9.10కి వేళాంకాన్ని చేరుకుంటుంది. రెండు సర్వీసులు నడుస్తాయి.

ట్రైన్ నెంబర్ 07126 వేళాంకాన్ని-చర్లపల్లి నడుమ 29.08.2026 నుంచి 05.09.2026 వరకు ట్రైన్లు నడుస్తాయి. వేళాంకాన్ని నుంచి రాత్రి 07.30కి వస్తుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తె...