భారతదేశం, జూలై 9 -- Vasudheva Sutham Release Trailer Out: టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు మాస్టర్ మహేంద్రన్. కర్మణ్యే వాధికారస్తే, అసలు ఏం జరిగిందంటే, నీలకంఠ, త్రికాల సినిమాలతో అలరించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా వసుదేవసుతం.

ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్‌కు జోడీగా హీరోయిన్ అంబికా వాణి నటించింది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను వసుదేవసుతం సినిమాను నిర్మించారు. ఈ సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు తాజాగా ఇవాళ వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్....