భారతదేశం, జూలై 22 -- సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ చైర్ కార్ సేవల విజయవంతం తర్వాత.. సుదీర్ఘ ప్రయాణాలను మరింత హాయిగా మార్చేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌కు దసరా పండుగ నాటికి తొలి వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే రాత్రివేళల్లో, సుదూర ప్రయాణాలు చేసేవారికి సౌకర్యవంతంగా ఉండేలా స్లీపర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ రైళ్లు విమాన ప్రయాణానికి ఏమాత్రం...