భారతదేశం, జూలై 14 -- తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TGBCESDTC) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) 2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ కార్యక్రమం 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. మొత్తం 150 మంది అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు. అందులో 100 మంది ఓపెన్ కేటగిరీ ద్వారా 50 మంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు సౌకర్యాలు ఉంటాయి. నెలకు రూ.5,000 స్టైపెండ్ (ప్రభుత్వ నిబంధనల మేరకు) అందిస్తారు. అంతేకాదు ఒకేసారి రూ.5,000 పుస్తక భృతి ఇస్తారు. గ్రంథాలయ సౌకర్యం, నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శక...