భారతదేశం, మే 21 -- UGC NET June 2026 Registration : దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం నిర్వహించే 'యూజీసీ నెట్ జూన్ 2026' పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే చివరి తేదీని పొడిగిస్తూ ఎన్‌టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత.. దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిజానికి గతంలో ప్రకటించిన ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం మే 20వ తేదీ రాత్రి 11:50 గంటలతోనే దరఖాస్తు గడువు ముగిసింది. అయితే, సాంకేతిక కారణాలు లేదా ఇతర ఇబ్బందుల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును మే 23వ తేదీ వరకు పొడిగించారు. ఆసక్తి మ...