భారతదేశం, మార్చి 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న సునామీ ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది.

పాన్ ఇండియా స్థాయిలో 'ధురంధర్ 2' రికార్డులు తిరగరాస్తుండటంతో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా స్పందించారు.

ఒక అభిమానుల సమావేశంలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈ సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందనపై స్పందిస్తూ.. "ట్రోలర్లు ఏమైనా అనుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ నేను నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే స్వీకరిస్తాను" అని చెప్పారు. ...