భారతదేశం, నవంబర్ 5 -- Kutumbam Awards Part 2 TV Premiere Jayammu Nischayammu Raa 2 OTT: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ దీపావళి పండుగ వేళ డబుల్ ధమాకా వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. అంగరంగ వైభవంగా సాగే అవార్డుల వేడుక ఒకవైపు, పాలిటిక్స్ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో సాగే స్పెషల్ టాక్ షో మరొకవైపు ప్రేక్షకులను అలరించనున్నాయి.

నవంబర్ 7, 8 తేదీల్లో ప్రసారం కానున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలు బుల్లితెర ప్రియులకు దివాళఇ పండగ వాతావరణాన్ని ముందే తీసుకురానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ రోజుల్లో టీవీ వినోదానికి ఎప్పుడూ భారీ ఆదరణ ఉంటుంది. కుటుంబ సమేతంగా కూర్చుని చూసే షోలు రేటింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తాయి. అందుకే ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినీ, రాజకీయ ప్రముఖుల కాంబినేషన్‌తో జీ తెలుగు భారీ ప్లాన్ రూపొందించింది.

నవంబ...