భారతదేశం, ఏప్రిల్ 20 -- TV Heroine Dipika Kakar Crying In MRI Scan: 'సిమర్'గా హిందీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దీపికా కక్కర్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ (Stage 2 Liver Cancer) తో పోరాడుతున్న దీపికా కక్కర్ తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. తన భర్త షోయబ్ ఇబ్రహీం యూట్యూబ్ ఛానెల్ వేదికగా తాము ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సంఘర్షణను అభిమానులతో పంచుకున్నారు.

క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యుల సూచన మేరకు దీపికా ప్రతి నెలా ఎమ్‌ఆర్‌ఐ (MRI) స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన స్కాన్ సమయంలో ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.

"స్కాన్ మిషన్‌లోకి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత కూడా నా ఏడుపు ఆగలేదు. చాలా భయమేసింది. కానీ, కొన్నిసార్లు ఏడవ...