భారతదేశం, మే 21 -- This Weekend Entertainment On OTT And TV: సరికొత్త కార్యక్రమాలు, సూపర్​ హిట్​ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్‌ మరిన్ని కార్యక్రమాలతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న డ్రామా జూనియర్స్ రియాలిటీ షో మరో సీజన్‌​తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

ఈ వారాంతంలో (వీకెండ్‌లో) డ్రామా జూనియర్స్​ సీజన్ 9 గ్రాండ్​ లాంచ్‌ కానుంది. దాంతోపాటు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను అలరించనుంది మీ జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 జీ5 (ZEE5)లో ఓటీటీ రిలీజ్ కానుంది.

మే 21 నుంచి జీ5లో డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత మే 23 నుంచ...