భారతదేశం, మార్చి 22 -- థియేటర్లలో సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఓటీటీలోకి దాదాపుగా 20 నుంచి 2, 3 నెలల్లోపు స్ట్రీమింగ్‌కు వస్తాయి. అలాగే, ఓటీటీ రిలీజ్ అనంతరం సుమారు నెల దాటిన తర్వాతే టీవీ ప్రీమియర్ అవుతుంటాయి. అలాంటిది ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 9 రోజుల్లోనే తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా బుల్లితెరపై సందడి చేయనుంది.

అది కూడా ఓటీటీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన మూవీ అవడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ సినిమా మరేదో కాదు మాస్ మహరాజా రవితేజ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించిన ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.

కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైం...