భారతదేశం, సెప్టెంబర్ 19 -- Weekend TV Premieres Telugu: తెలుగువారి ఇళ్లలో పండుగ వాతావరణం వచ్చిందంటే చాలు బుల్లితెర ఛానళ్లు సరికొత్త వినోదాల విందుతో ముస్తాబవుతాయి. గణేష్ నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'జీ తెలుగు' ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం నాడు అంటే రేపు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకవైపు సరికొత్త సినిమా టీవీ ప్రీమియర్, మరోవైపు బుల్లితెర సెలబ్రిటీల కోలాహలంతో కూడిన ప్రత్యేక కార్యక్రమంతో పండుగ శోభను ప్రతి ఇంటికీ తీసుకురానుంది.

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రంతో అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చారు. కమల్ తేజ నర్ల దర్శకత్వంలో ...