Tummidihatti Barrage : 'తుమ్మిడిహెట్టి' బ్యారేజీ వివాదంపై కదలిక - సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక భేటీ..!
భారతదేశం, ఆగస్టు 28 -- Tummidihatti Barrage : ఉమ్మడి ఆదిలాబాద్ సహా తెలంగాణలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంలో చాలా కాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన ఈ బ్యారేజ్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబర్ 1న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని సేవా భవన్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.
సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.