భారతదేశం, ఆగస్టు 28 -- Tummidihatti Barrage : ఉమ్మడి ఆదిలాబాద్‌ సహా తెలంగాణలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంలో చాలా కాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన ఈ బ్యారేజ్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబర్ 1న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఢిల్లీలోని సేవా భవన్‌లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.

సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీ...