భారతదేశం, మే 9 -- TTD Engineering Recruitment : ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టుల భర్తీకి సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, మరియు నిర్వహణ పనుల్లో ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్ లకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఏఈఈ (సివిల్) - 93 కేంద్రాలు, ఏఈఈ (ఎలక్ట్రికల్)- 16 కేంద్రాలు, ఏఈ (సివిల్)- 42 కేంద్రాలు, ఏటీవో (సివిల్) - 42 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయని టీటీడీ తాజా ప్రకటనలో పేర్కొంది.

అభ్...