భారతదేశం, మార్చి 12 -- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ వేల మంది కడుపు నింపుకొంటారు. మరోవైపు లడ్డూలు కూడా వేల సంఖ్యలో అమ్ముడవుతాయి. వీటన్నింటికీ ఎల్పీజీ అవసరం. అయితే ఇప్పుడు దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం తిరుమలపై కూడా పడిందా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.
తిరుమలలో లడ్డూ, అన్నదానం వంటశాలలకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని టీటీడీ తెలిపింది. తిరుమలలో ప్రతిరోజూ సగటున నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారని, పండుగ సమయాల్లో ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు పెరుగుతుందని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.
తిరుమలలో లడ్డూ తయారీకి, అన్నదానం యూనిట్లకు కలిపి మొత్తం వంట గ్యాస్ అవసరం రోజుకు 10 టన్నులక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.