భారతదేశం, ఫిబ్రవరి 10 -- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హవాలా మనీ కోణం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్‌పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం.. ఈ కేసు హవాలా ఆధారిత నగదు లావాదేవీలు, ప్రైవేట్ పాల సంస్థలు, మధ్యవర్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులకు నెయ్యి టెండర్లు, అనుమతులను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు చెల్లించడం చుట్టూ నడుస్తోంది. హవాలా ఆపరేటర్ల ద్వారా తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగిన...