భారతదేశం, ఆగస్టు 1 -- తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో, ఇతర అనుబంధ ఆలయాల్లో ఆగస్టు నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఆ వివరాలేంటో చూడండి.

ఆగ‌ష్టు 7, 14, 28వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఆగ‌ష్టు 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంట‌ల‌కు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

ఆగ‌ష్ఠు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

ఆగ‌ష్టు 8న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

ఆగ‌ష్టు 3, 30వ తేదీల‌ల్లో ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌...