భారతదేశం, ఆగస్టు 3 -- తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందనున్నారు.

ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి మహోత్సవ ఊరేగింపుగా తీసుకువ...