భారతదేశం, జూన్ 16 -- TG DOST 3rd Phase Counselling : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన గమనింపు. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (DOST) 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దోస్త్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ సవరించిన తేదీల వివరాలను వెల్లడించారు. వివిధ కారణాల వల్ల ఈ విడత కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.

మారిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు.. ఈ నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దోస్త్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల...