భారతదేశం, మే 14 -- TRP Ratings: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఛానెళ్ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. తాజాగా 18వ వారం టీఆర్పీ (TRP) రేటింగ్స్ విశ్లేషిస్తే ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఈ వారంలో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ అద్భుతమైన రేటింగ్స్‌తో సంచలనం సృష్టించింది. గత కొన్ని వారాలుగా రెండో స్థానంలో ఉన్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌ను ఇది వెనక్కి నెట్టేయడం విశేషం.

వరుసగా వస్తున్న మార్పుల వల్ల ఈ వారం దాదాపు అన్ని సీరియల్స్ రేటింగ్స్ గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. తాజాగా రిలీజైన రేటింగ్స్ ప్రకారం చూస్తే.. 'కార్తీక దీపం 2' ఇప్పటికీ 10.18 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ చాలా రోజుల తర్వాత ఈ సీరియల్ రేటింగ్ మరీ 10 స్థాయ...