భారతదేశం, మే 11 -- Trisha First Post After Vijay Oath As Tamil Nadu CM: చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆదివారం (మే 10) ఒక అరుదైన రాజకీయ వేడుకకు వేదికైంది. వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో అలరించిన చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు తారలు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి మాత్రం హీరోయిన్ త్రిష కృష్ణన్‌పైనే ఉంది. విజయ్‌తో ఆమెకు ఉన్న రిలేషన్‌షిప్ నేపథ్యంలో, ఈ వేడుకలో త్రిష సందడి చర్చనీయాంశమైంది.

త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ చారిత్రక సందర్భానికి తగ్గట్లుగా ఆమె ఎంతో హుందాగా కనిపించారు. సీ-ఫోమ్ గ్రీన్ కలర్ చీర, బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ ఉన్న క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి సంప్రదాయబద్ధంగా ...