భారతదేశం, ఏప్రిల్ 24 -- KD The Devil Trailer Removed From YouTube: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'కేడీ: ది డెవిల్' ట్రైలర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. విడుదలైన కేవలం ఒక్క రోజులోనే కేవీఎన్ (KVN) ప్రొడక్షన్ సంస్థ ఈ ట్రైలర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సెన్సార్ బోర్డు నుంచి ఇంకా అనుమతి లభించని (Uncertified) కొన్ని దృశ్యాలను పొరపాటున ట్రైలర్‌లో చేర్చడమే దీనికి ప్రధాన కారణం.

"కేడీ ది డెవిల్ ట్రైలర్ ఎడిటింగ్ ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్ల సర్టిఫికేషన్ లేని కంటెంట్ బయటకు వచ్చింది. అందుకే దీనిని తొలగించి, నిబంధనల ప్రకారం మార్పులు చేసిన కొత్త ట్రైలర్‌ను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాం" అని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

నిజానికి ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడం ఇది మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రంలోని 'సర్క...