భారతదేశం, జూలై 21 -- Hyderabad Traffic Advisory : హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి తిరు కల్యాణోత్సవం, రథోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చూసేందుకు, నగరంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రతను కాపాడటం మరియు ట్రాఫిక్ జామ్‌లను నివారించడమే లక్ష్యంగా జూలై 21(ఇవాళ), జూలై 22(రేపు) తేదీలలో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఉత్సవాలు జరిగే రోజుల్లో బల్కంపేట పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించే వాహనదారులు పోలీసులు సూచిం...