భారతదేశం, నవంబర్ 26 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జపాన్ దిగ్గజం టయోటా తమ పాపులర్ ఎంపీవీ 'ఇన్నోవా హైక్రాస్'లో ఫేస్‌లిఫ్ట్​ వర్షెన్​ని తాజాగా దేశీయంగా విడుదల చేసింది. మిడ్-లైఫ్ అప్‌డేట్‌లో భాగంగా పలు కీలక మార్పులతో వచ్చిన ఈ కారు.. భారతదేశంలోనే మొట్టమొదటి 'ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్' వాహనంగా నిలిచింది. ఎప్పటినుంచో కారు ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ఇప్పుడు సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. 6, 7 సీటర్ లేఅవుట్‌లలో లభించే ఈ అప్‌డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ప్రారంభ ధరను రూ. 19.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) టయోటా నిర్ణయించింది.

కొన్ని వారాల క్రితమే ఇండోనేషియా మార్కెట్లో అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసిన టయోటా, ఇప్పుడు భారత్‌లోనూ అదే తరహా మా...