భారతదేశం, అక్టోబర్ 14 -- ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పట్టు సాధించేందుకు 'టయోటా కిర్లోస్కర్ మోటార్' తమ పాపులర్ మోడల్ 'గ్లాంజా ఫేస్‌లిఫ్ట్'ను బుధవారం దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించినప్పటికీ, టయోటా గ్లోబల్ డిజైన్ శైలికి అనుగుణంగా ప్రత్యేకమైన మార్పులు చేసి లగ్జరీ లుక్‌ను అందించారు.

ఈ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టయాటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త రీ-డిజైన్డ్ ఫ్రంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. హెడ్‌లైట్ల ఆకారాన్ని పాత మోడల్ తరహాలోనే ఉంచినప్పటికీ, రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌ను టయోటా గ్లోబల్ స్...