భారతదేశం, జూన్ 21 -- Toxic Release Date: కన్నడ స్టార్ హీరో, రాకీ భాయ్ యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది.

ఆదివారం (జూన్ 21) హీరో యష్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా టాక్సిక్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

"తండ్రిని గౌరవించండి... టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని యష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ను దృష్ట...