భారతదేశం, మార్చి 10 -- కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్', బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' మధ్య బాక్సాఫీస్ పోరు గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.

మొదట ఈ రెండు సినిమాలు మార్చి 19న ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా టాక్సిక్ మేకర్స్ తమ సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రణ్‌వీర్ సింగ్ సినిమా పోటీకి భయపడే యశ్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

కానీ, తాజా సమాచారం ప్రకారం యశ్‌కు 'ధురంధర్ 2' అంటే ఎలాంటి భయం లేదని, పైగా ఆయన ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. "యశ్‌కు ధురంధర్ మొదటి భాగం చాలా నచ్చింది. పార్ట్ 2 కోసం ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాల మధ్య పోటీ, ఆందోళన అంతా బయట వ్యక్తులు స...