భారతదేశం, ఆగస్టు 2 -- Huma Qureshi On Kiara Advani Intimate Scenes: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో టాక్సిక్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో ఇటీవల టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన 'తబాహీ' పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఈ పాటలో హీరో యశ్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ (Intimate Scenes) ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.

'తబాహీ' పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో కియారా అద్వానీని లక్ష్యంగా చేసుకుని దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. వివాహమై, తల్లి అయిన తర్వాత కూడా ఇలాంటి దృశ్యాల్లో నటించడం ఏంటంటూ కొందరు కియారాను విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా ఆమె భర్త...