భారతదేశం, జూలై 28 -- Tom Holland: హాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన యంగ్ హీరోగా టామ్ హాలండ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆయన నటించిన సినిమాలు ఏకంగా $12 బిలియన్ల (దాదాపు రూ. 1.14 లక్షల కోట్లు) బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 'ది ఒడిస్సీ', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రాలతో ఈ ఏడాది ఆయన గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమయ్యారు.

ఒక సాధారణ నటుడికి సమ్మర్ లో ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా అదృష్టంగా భావిస్తారు. కానీ టామ్ హాలండ్ ఒకే ఏడాది రెండు భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను పలకరించడం హాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

టామ్ హాలండ్ ఇంతటి చిన్న వయసులోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదగడం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. ...