భారతదేశం, జూన్ 6 -- Tollywood vs Bollywood Nepotism Analysis: చిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీయానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ల నెపోటిజం ట్యాగ్‌పై స్పందిస్తూ, వారసత్వంగా వచ్చిన నటులు తమ కుటుంబాల విజయాలతో పోటీ పడాలనే అదనపు ఒత్తిడిని ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

అయితే, ఈ వారసత్వ వలయం బాలీవుడ్‌లో ఎదుర్కొంటున్న నిరసనలకు, టాలీవుడ్‌లో దక్కుతున్న బ్రహ్మరథానికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఒకే దేశంలో ఉన్న ఈ రెండు అతిపెద్ద చిత్ర పరిశ్రమలు నెపోటిజాన్ని చూసే కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

హిందీ చిత్ర పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా నెపోటిజం అనే పదం ఒక పెద్ద మార్కెట్ డిస్‌అడ్వాంటేజ్‌గా మారింది. కొందరు ప్రతిభావంతులైన అవుట్‌సైడర్ల మరణాలు, ఆ తర్వ...