భారతదేశం, అక్టోబర్ 29 -- Today OTT: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. ఆయన లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బత్తా' (Baththa). స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 1న తమిళనాట థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది.

తమిళంలో థియేటర్లలో రిలీజైన బత్తా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇవాళ (అక్టోబర్ 29) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

1986 నాటి మద్రాసు నేపథ్యంలో బత్తా మూవీ క...