భారతదేశం, మార్చి 23 -- హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా... మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 5, 6, 7, 8 తరగతులల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 31వతేదీతో ముగుస్తుంది.

రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల్లో 75శాతం సీట్లు మైనార్టీలకు, 25శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశారు. అభ్యర్థులు https://tgmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు తొలుత దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మైనార్టీయేతర విద్యార్థులకు లక్కీడిప్‌...