భారతదేశం, జూలై 10 -- భవిష్యత్తు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కోసం భారీ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పరిధిలోని 205 పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న దాదాపు 80 వేల మంది విద్యార్థులకు కృత్రిమ మేధ , డిజిటల్ సేఫ్టీ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ వినూత్న ప్రాజెక్టును టీఎంఆర్ఈఐఎస్, మాస్క్ నెక్స్ట్‌జెన్ ,డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (DCPL) సంస్థలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువస్తున్నాయి. ఇందులో గ్లోబల్ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా డాక్సా కన్సల్టింగ్ సంస్థ బాధ్యతలు నిర్వర్తించనుంది.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం 2026 ఆగస్టు 15న స్వాతంత్...