భారతదేశం, మే 4 -- Srikalahasti Road Accident : తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం... ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ అతివేగంగా ఉండటం, ఎదురుగా నిలిపి ఉన్న లారీని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఢీకొన్న వేగానికి అంబులెన్స్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో రోగి బంధువులు, అంబులెన్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.